
సంగారెడ్డి, 6 డిసెంబర్ (హి.స.) రాజ్యాంగాన్ని అంబేద్కర్ ముందు చూపుతో ఆలోచించి రాయడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని బిజెపి ఎమ్మెల్సీ డా. అంజిరెడ్డి అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం వారు పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయన ముందు చూపు, కృషి లేకపోతే ఈ రాష్ట్రం, ఈ పదవులు ఉండేవి కాదన్నారు. చీకట్లో ఉన్న వారికి వెలుగు చూపిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. తాను సంపాదించిన జ్ఞానాన్ని దేశ ప్రజల కోసం, అట్టడుగు వర్గాల కోసం ఉపయోగించారని తెలిపారు. మహిళలకు కార్మికులకు దళిత గిరిజనులకు అన్ని వర్గాల్లో వెలుగు నింపాడని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు