ఎన్నికలంటే ఎమోషన్, కులం, రంగుకు సంబంధిoచినవి కాదు.. ఈటెల.
హనుమకొండ, 6 డిసెంబర్ (హి.స.) బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడికి వచ్చి చచ్చిపోతాం అని కొంగుపట్టి ఓటు అడిగితే చచ్చిపోతాడేమో అని మన ఆడబిడ్డలు కరిగిపోయి
ఈటెల


హనుమకొండ, 6 డిసెంబర్ (హి.స.)

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడికి వచ్చి చచ్చిపోతాం అని కొంగుపట్టి ఓటు అడిగితే చచ్చిపోతాడేమో అని మన ఆడబిడ్డలు కరిగిపోయి ఓట్లు వేస్తే ఈ రెండేళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు. ఇవాళ హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటెల మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో వారు చేసింది కేవలం డ్రామా అని తేలిపోయిందన్నారు. ఒక్కరోజు వారు ఏడుస్తారు మీరు ఐదేళ్లు ఏడుస్తారు అని నేను చెప్పినప్పుడు మీకు అర్థం కాలేదని కానీ రెండేళ్లుగా ఏం జరుగుతుంది చూస్తూనే ఉన్నారు.... మీ అంతరాత్మకు అడగండి అన్నారు. ఎన్నికలంటే ఎమోషన్, కులం, రంగుకు సంబంధిoచింది కాదని ప్రజల బ్రతుకుకు సంబంధించిందన్నారు. పదవులు మీ ఓట్లకు పుట్టేవని డబ్బుకు, సారా సీసాకు పుట్టేవి కావన్నారు. నన్ను ఈస్థాయికి తీసుకు వచ్చింది, నన్ను గుర్తుపట్టడానికి కారణం ఈ కమలాపూర్ గడ్డ అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande