విశాఖలో నేడు. భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్ డే.క్రికెట్ మ్యాచ్
అమరావతి, 6 డిసెంబర్ (హి.స.) మధురవాడ, డిసెంబరు 06:భారత్- దక్షిణాఫ్రికా(IND Vs SA) జట్ల మధ్య పీఎం పాలెం ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం(ACA VDCA Cricket Stadium)లో శనివారం జరగనున్న డే అండ్ నైట్ వన్డే మ్యాచ్(Oneday Match) సందర్భంగా ట్రాఫిక్ మళ్లించినట
విశాఖలో నేడు.   భారత్ దక్షిణాఫ్రికా  జట్ల మధ్య  వన్ డే.క్రికెట్ మ్యాచ్


అమరావతి, 6 డిసెంబర్ (హి.స.)

మధురవాడ, డిసెంబరు 06:భారత్- దక్షిణాఫ్రికా(IND Vs SA) జట్ల మధ్య పీఎం పాలెం ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం(ACA VDCA Cricket Stadium)లో శనివారం జరగనున్న డే అండ్ నైట్ వన్డే మ్యాచ్(Oneday Match) సందర్భంగా ట్రాఫిక్ మళ్లించినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. ప్రేక్షకుల వాహనాల పార్కింగ్‌కు 11 చోట్ల స్థలాలు ఏర్పాటుచేశామన్నారు.

శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం నుంచి నగరానికి వచ్చే వాహనాలు.. పెందుర్తి, ఎన్ఏడీ, టీసీ పాలెం మీదుగా వెళ్లాలి. నగరం నుంచి ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం వైపునకు వెళ్లే బస్సులు టీసీ పాలెం, ఎన్ఏడీ, పెందుర్తి, శొంఠ్యాం మీదుగా ప్రయాణించాలి. విజయనగరం, శ్రీకాకుళం నుంచి నగరానికి వచ్చే చిన్న వాహనాలు మారికివలస వద్ద ఎడమవైపు తిరిగి జురాంగ్ జంక్షన్ మీదుగా తిమ్మాపురం వద్ద కుడివైపు తిరిగి బీచోడ్డుపై రుషికొండ, సాగర్ నగర్, జోడుగుళ్లపాలెం మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకోవాలి. కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు కారు షెడ్ వద్ద మలుపు తిరిగి మిథిలాపురి ఉడా కాలనీ, ఎంవీవీ సిటీ, లాకాలేజీ మీదుగా పనోరమ హిల్స్ చేరుకుని.. రుషికొండ మీదుగా నగరంలోకి వెళ్లాలి. నగరం నుంచి వచ్చే బస్సులు, కమర్షియల్ వాహనాలు హనుమంతవాక వద్ద బీఆర్ ఎస్ రోడ్డులో అడవివరం, నీలకుండీలు జంక్షన్ మీదుగా ఆనందపురం చేరుకోవాలి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande