ఇండిగో సంక్షోభానికి కేంద్రమే కారణం.. సీపీఐ నారాయణ
హైదరాబాద్, 6 డిసెంబర్ (హి.స.) ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభంపై సీపీఐ నారాయణ స్పందించారు. విమానాలు రద్దు చేయడం వల్ల సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వమే కారణం అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాధనాన
సీపీఐ నారాయణ


హైదరాబాద్, 6 డిసెంబర్ (హి.స.)

ఇండిగో విమానయాన సంస్థ

సంక్షోభంపై సీపీఐ నారాయణ స్పందించారు. విమానాలు రద్దు చేయడం వల్ల సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వమే కారణం అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేస్తూ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతుందన్నారు. ఇండిగో విమానయాన సంస్థకు చెందిన విమానాలు అన్నింటినీ కేంద్రం ఆధీనంలోకి తీసుకుని నిర్వహించాలని డిమాండ్ చేశారు. పబ్లిక్ సెక్టార్ విమానయాన సంస్థలను కేంద్రమే చంపేసిందన్నారు. ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రజలను, ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తోందని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande