
హైదరాబాద్, 6 డిసెంబర్ (హి.స.) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని హైదరాబాద్లోని వారి నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కొమురవెల్లి మండల బీజేపీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి, మనోహరాబాద్ రైల్వే లైన్లో భాగంగా కొమురవెల్లిలో నిర్మిస్తున్న మల్లన్న హల్ట్ రైల్వేస్టేషన్ పనుల పురోగతిపై వివరించి,స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మూడు నెలలపాటు జరిగే జాతర సమయంలో స్థానిక వర్తక వ్యాపార వర్గాలు వివిధ ప్రాంతాల నుండి దర్శనార్థం వస్తున్న భక్తులు మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థ వలన ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను మంత్రికి వివరించారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి కొమురవెల్లిలో మెరుగైన కమ్యూనికేషన్ ఉండేలా ఆపరేటర్లకు ఆదేశాలు జారీచేస్తానని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు