లోక్సభలోకి డీప్ఫేక్ నియంత్రణ బిల్లు.. ప్రవేశపెట్టిన ఎంపీ శ్రీకాంత్ షిండే
న్యూఢిల్లీ, 6 డిసెంబర్ (హి.స.) దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో డీప్ ఫేక్ వీడియోల కట్టడికి అవసరమైన లీగల్ ఫ్రేమ వర్ను రూపొందించేలా ప్రైవేట్ మెంబర్ బిల్లును ఇవాళ లోక్సభలో శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో కీలక విషయాలను పొంద
డీపఫేక్ నియంత్రణ


న్యూఢిల్లీ, 6 డిసెంబర్ (హి.స.)

దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో

డీప్ ఫేక్ వీడియోల కట్టడికి అవసరమైన లీగల్ ఫ్రేమ వర్ను రూపొందించేలా ప్రైవేట్ మెంబర్ బిల్లును ఇవాళ లోక్సభలో శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో కీలక విషయాలను పొందుపరిచారు. ఎవరి ఇమేజ్ లేదా వాయిస్ ను డీప్ ఫేక్ కు ఉపయోగించినా వారి ముందస్తు అనుమతి తప్పనిసరి అనే పేర్కొన్నారు. హానికర ఉద్దేశంతో డీప్ఫేక్లను తయారు చేసినా, షేర్ చేసినా కఠిన శిక్షలు విధించనున్నట్లుగా పేర్కొన్నారు. డీపేఫేక్ బెదిరింపులను అంచనా వేయడానికి, గుర్తించే టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి డీపేఫేక్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande