దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో మూడు రోజుల పాటు.అతి.భారీ వర్షాలు
నెల్లూరు, , 6 డిసెంబర్ (హి.స.)దిత్వా తుఫాన్‌ ప్రభావంతో మూడు రోజులు కురిసిన అతి భారీ వర్షాలు నెల్లూరు జిల్లా రైతులను నిండా ముంచాయి. మొత్తం 19 మండలాలపై తీవ్ర ప్రభావం చూపింది. నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు 188 గ్రామాల్లో 12,315 మంది తుఫాన్‌ బాధితులుగా మ
దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో మూడు రోజుల పాటు.అతి.భారీ వర్షాలు


నెల్లూరు, , 6 డిసెంబర్ (హి.స.)దిత్వా తుఫాన్‌ ప్రభావంతో మూడు రోజులు కురిసిన అతి భారీ వర్షాలు నెల్లూరు జిల్లా రైతులను నిండా ముంచాయి. మొత్తం 19 మండలాలపై తీవ్ర ప్రభావం చూపింది. నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు 188 గ్రామాల్లో 12,315 మంది తుఫాన్‌ బాధితులుగా మిగిలారు. వ్యవసాయ సీజన్‌ ప్రారంభ దశ కావడంతో రైతులకు నష్టంతోపాటు శ్రమ వృథా అయ్యింది. 6439 హెక్టార్లలో (16,097 ఎకరాలు) పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. 85 చోట్ల చెరువులు, కాలువలకు డ్యామేజీ కాగా, తాత్కాలిక మరమ్మతులకు రూ.4.5 కోట్లు అవసరమవుతాయని ఇరిగేషన్‌ అధికారులు అంచనా వేశారు. 14 చోట్ల 33 కేవీ ఫీడర్స్‌, 45 చోట్ల 11 కేవీ ఫీడర్స్‌, 8 సబ్‌స్టేషన్లు, దెబ్బతిన్నాయి. 30 ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురికాగా, 33 కేవీ పోల్స్‌ రెండు, 11 కేవీ పోల్స్‌ 13, ఎల్‌టీ పోల్స్‌ 7 దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande