
హైదరాబాద్, 6 డిసెంబర్ (హి.స.)
అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో తెలంగాణ విద్యార్థిని ఉడుముల సహజారెడ్డి(24) మృతి చెందారు. ఉన్నతవిద్య కోసం నాలుగేళ్ల క్రితం ఆమె అమెరికా వెళ్లారు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి బర్మింగ్హామ్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్లో జరిగిన అగ్నిప్రమాదంలో సహజ రెడ్డి మృతి చెందినట్లు తెలిసింది. కాగా సహజారెడ్డి స్వస్థలం మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామం.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు