పారిశ్రామిక భూముల అమ్మకంలో కార్మికులకు వాటా ఇవ్వాలి.. ఎమ్మెల్యే మల్లారెడ్డి
హైదరాబాద్, 6 డిసెంబర్ (హి.స.) పారిశ్రామిక వాడల భూములను అమ్మితే అందులో కూడా 20% డబ్బులు కార్మికులకు ఇవ్వాలని మాజీ మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాదులో నేడు జరిగిన ట్రేడ్ యూనియన్ ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలో మల్లారెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మల్లారెడ్డి


హైదరాబాద్, 6 డిసెంబర్ (హి.స.) పారిశ్రామిక వాడల భూములను

అమ్మితే అందులో కూడా 20% డబ్బులు కార్మికులకు ఇవ్వాలని మాజీ మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాదులో నేడు జరిగిన ట్రేడ్ యూనియన్ ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలో మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో సినిమా టికెట్ ధరలు పెంచితే అందులో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాలని చట్టం తెస్తానని చెప్పాడన్నారు. మరి పారిశ్రామికవాడల భూములు అమ్మినప్పుడు కూడా కార్మికులకు 20శాతం ఇవ్వాలనే చట్టం తీసుకురావాలన్నారు. కేంద్రం కూడా కొత్త కొత్త చట్టాలు తీసుకువచ్చి కార్మికులను మోసం చేయాలని చూస్తోందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande