
నాగర్ కర్నూల్, 6 డిసెంబర్ (హి.స.) విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలు
పెంపు కీలకమని హైకోర్టు జస్టిస్ మాధవి దేవి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్, ప్రొజెక్టర్, డిజిటల్ క్లాస్లూమ్లను శనివారం జస్టిస్ మాధవి దేవి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జస్టిస్ మాధవి మాట్లాడుతూ.. విద్యార్థులు పుస్తకాలతో పాటు డిజిటల్ నెపుణ్యాలు నేర్చుకోవడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. టెక్నాలజీ నేర్చుకున్న విద్యార్థులు భవిష్యత్తులో ఏ రంగంలోనైనా ముందంజలో ఉంటారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు కూడా ప్రపంచ స్థాయి అవకాశాలను అందుకోవాలని, ఈ సౌకర్యాలను సమర్థవంతంగా వినియోగించి కుటుంబం, సమాజం, దేశానికి గౌరవం తీసుకురావాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు