
ఢిల్లీ ,06 డిసెంబర్ (హి.స.) తమిళనాడు రాష్ట్రంలోని హోసూరు పట్టణం చతికి గజగజ వణికిపోతోంది. ఇక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు చలితో ఇళ్లనుంచి బయటకు రాలేకపోతున్నారు. అలాగే మంచుకూడా విపరీతంగా పడుతోంది. నిన్న 16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ప్రతి సంవత్సరం హోసూరు(Hosuru) ప్రాంతంలో నవంబరు, డిసెంబరు నెలల్లో తీవ్రమైన చలి ఉంటుంది. భారీ వర్షాల కారణంగా, చలి ప్రభావం సాధారణం కంటే ఎక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితిలో తుఫాను ప్రభావం కారణంగా తమిళనాడు(Tamil Nadu)లోని వివిధ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ గత 3 రోజులుగా హోసూరు ప్రాంతంలో కూడా చాలా చల్లని ప్రాంతంగా మారిపోయింది. శుక్రవారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత 16.3 డిగ్రీలు ఉష్ణోగ్రత సెల్సియ్‌సగా నమోదైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ