బస్టాండ్లను మరిపిస్తున్న విమానాశ్రయాలు.. కేటీఆర్
హైదరాబాద్, 6 డిసెంబర్ (హి.స.) ఇండిగో ఎయిర్లైన్స్ విషయం పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన అధికారం ఒకరు, ఇద్దరు చేతిల్లో కేంద్రీకృతం అయితే ఇప్పుడు దేశంలో విమానాశ్రయాల్లో ఉన్న పరిస్థితి వ
కేటీఆర్


హైదరాబాద్, 6 డిసెంబర్ (హి.స.) ఇండిగో ఎయిర్లైన్స్ విషయం పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన అధికారం ఒకరు, ఇద్దరు చేతిల్లో కేంద్రీకృతం అయితే ఇప్పుడు దేశంలో విమానాశ్రయాల్లో ఉన్న పరిస్థితి వస్తుందని అన్నారు. పైలట్లను శ్రమ దోపిడీ చేయవద్దని ఏడాది క్రితమే కేంద్రం చెప్పినా ఇండిగో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని అన్నారు. అందువల్లే ఇప్పుడు ఇండిగో సమస్య వచ్చిందన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో విమానాశ్రయాలు కూడా బస్టాండ్లు మాదిరి తయారయ్యాయని విమానాశ్రయాల్లో పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. కొత్త నిబంధనల విషయంలో ఇండిగో వెనక్కి తగ్గలేదని కేంద్రమే తన ఆదేశాలు వెనక్కి తీసుకుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande