పంచాయతీ ఎన్నికలపై కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కీలక ప్రకటన
కామారెడ్డి, 6 డిసెంబర్ (హి.స.) కామారెడ్డి జిల్లాలో మూడు దశలలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అన్ని దశల ఎన్నికలు పూర్తయ్యే వరకు అమలులో కొనసాగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటన
కామారెడ్డి కలెక్టర్


కామారెడ్డి, 6 డిసెంబర్ (హి.స.)

కామారెడ్డి జిల్లాలో మూడు దశలలో

జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అన్ని దశల ఎన్నికలు పూర్తయ్యే వరకు అమలులో కొనసాగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సర్పంచ్, వార్డ్ సభ్యుల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి మూడవ దశ ఎన్నికలు పూర్తయ్యే వరకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన తేదీ వరకూ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మొదటి దశ, రెండవ దశల్లో ఎన్నికైన సర్పంచ్, వార్డు మెంబెర్ అభ్యర్థులు లేదా ఇతరులు కూడా, మూడవ దశ ఎన్నికలు, పరోక్ష ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించరాదన్నారు. ఎవరైనా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు పాల్పడినట్లయితే ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande