గుమ్మడి నరసయ్య మహోన్నత వ్యక్తి.. మంత్రి కోమటిరెడ్డి
ఖమ్మం, 6 డిసెంబర్ (హి.స.) ఖమ్మంలో నేడు జరిగిన గుమ్మడి సర్సయ్య సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుమ్మడి నర్సయ్యతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. తాను ఒకసారి ఎంపీగా, ఐదుసార్లు
మంత్రి కోమటిరెడ్డి


ఖమ్మం, 6 డిసెంబర్ (హి.స.)

ఖమ్మంలో నేడు జరిగిన గుమ్మడి సర్సయ్య సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుమ్మడి నర్సయ్యతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. తాను ఒకసారి ఎంపీగా, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, నర్సన్న ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. కానీ ఆయనకు తాను పోటీకి రానని అన్నారు. నర్సయ్యకు ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఎవరూ పోటీ కాదని చెప్పారు.

ఆయన మహోన్నత వ్యక్తి అని చెప్పారు. ఎమ్మెల్యే అయినా తనకు ఉన్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేస్తూనే నర్సయ్య కుటుంబాన్ని పోషించుకున్నారని అన్నారు. తనకు వచ్చిన జీతాన్ని సైతం పేద ప్రజలకే పంచిపెట్టారని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande