
రంగారెడ్డి, 6 డిసెంబర్ (హి.స.) భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ ఈనెల 8, 9 తేదీలలో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో జరుగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల పనులను శనివారం మంత్రి పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి పనుల పురోగతిని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోని రాష్ట్రాలతో కాదు.. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో తెలంగాణ రాష్ట్రం పోటీ పడుతోందని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు