ఎవరో రెచ్చగొడితే బీసీలు బలి పశువులు కావొద్దు.. మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, 6 డిసెంబర్ (హి.స.) ఎవరో రెచ్చగొడితే బీసీలు బలి పశువులు కావొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర్ మృతదేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నగరంలోని అంబర్పేటలో నివాళులర్పించారు. అనంతరం మంత్
మంత్రి పొన్నం ప్రభాకర్


హైదరాబాద్, 6 డిసెంబర్ (హి.స.)

ఎవరో రెచ్చగొడితే బీసీలు బలి

పశువులు కావొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర్ మృతదేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నగరంలోని అంబర్పేటలో నివాళులర్పించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ బలహీనవర్గాలకు కాంగ్రెస్ న్యాయం చేసిన తీరును తెలిపారు. కానీ, ఎవరో రెచ్చగొడితే బీసీలు బలి పశువులు కావొద్దని పిలుపునిచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి, అమరుడు సాయి ఈశ్వర్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున సాయం అందిస్తామని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande