బాబ్రీ మసీదు కూల్చివేత పై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, 6 డిసెంబర్ (హి.స.) భారత్లో 500 ఏళ్ల నాటి గాయాలకు చికిత్స జరుగుతోంది అని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. 1992లో బాబ్రీ మసీదును పోలీసుల సమక్షంలో కూల్చివేశారని గుర్తు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత అనే
ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ


హైదరాబాద్, 6 డిసెంబర్ (హి.స.)

భారత్లో 500 ఏళ్ల నాటి గాయాలకు చికిత్స జరుగుతోంది అని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. 1992లో బాబ్రీ మసీదును పోలీసుల సమక్షంలో కూల్చివేశారని గుర్తు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత అనేది చట్ట ఉల్లంఘన అని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని ఆయన పేర్కొన్నారు.

ఏ దేవాలయాన్ని కూల్చి మసీదు కట్టలేదని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు, ప్రధాని ఈ మాట ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ 6, 1992న కూల్చివేసింది మసీదును మాత్రమే కాదని, ఆ రోజు కరసేవకులు భారత రాజ్యాంగాన్ని బలహీనపరిచారని.. అందుకే ఈ రోజును 'బ్లాక్ డే'గా పేర్కొన్నారు. ఆ రోజు జరిగిన సంఘటన వలన ఏర్పడిన గాయాలు మసీదు కూల్చివేతకు సంబంధించినవి కాదు, రాజ్యాంగం బలహీనపడటం వలన ఏర్పడ్డాయని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande