ఎన్నికలలో అల్లర్ల నిరోధకానికి పోలీసుల కసరత్తు : ఏసీపీ వసుంధర
ఖమ్మం, 6 డిసెంబర్ (హి.స.) గ్రామపంచాయతీ ఎన్నికలకు ముందు అల్లర్ల నిరోధక కసరత్తు రిఫ్రెషర్ కోర్సును వైరా డివిజన్ పోలీసులు నిర్వహించారని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సాయుధ రిజర్వ్, సివిల్, స్పెషల్ పార్టీ పోలీసులకు
ఏసీపీ వసుంధర


ఖమ్మం, 6 డిసెంబర్ (హి.స.)

గ్రామపంచాయతీ ఎన్నికలకు ముందు

అల్లర్ల నిరోధక కసరత్తు రిఫ్రెషర్ కోర్సును వైరా డివిజన్ పోలీసులు నిర్వహించారని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సాయుధ రిజర్వ్, సివిల్, స్పెషల్ పార్టీ పోలీసులకు సిబ్బందిని సన్నద్ధం చేయడానికి వివిధ కీలకమైన అంశాలైన లాఠీ డ్రిల్స్, మాబ్ కంట్రోల్, స్టోన్ గార్డ్స్, హెల్మెట్లు, టియర్ గ్యాస్ ఆయుధాలు వంటి పరికరాల నిర్వహణ పై ప్రత్యేక సెషన్లు నిర్వహించారని అన్నారు. క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి పోలింగ్ సమయంలో పోలీసు సిబ్బంది నిరంతరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఏసిపి చెప్పారు. ఊహించని పరిస్థితులను ఎదుర్కోవడంలో దృష్టి సారించే నిర్మాణాత్మక శిక్షణ, మాక్ డ్రిల్ గణనీయంగా దోహదపడుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande