అయ్యప్ప మాల లో ఉన్న విద్యార్థిని కళాశాలకు అనుమతించని యాజమాన్యం..
మేడ్చల్ మల్కాజిగిరి, 6 డిసెంబర్ (హి.స.) జీహెచ్ఎంసీ పోచారం సర్కిల్ పరిధిలోని నల్లమల్లా రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలకు అయ్యప్ప మాల వేసుకుని వచ్చిన విద్యార్థి పట్ల యాజమాన్యం అవమానకరంగా వ్యవహరించారని శనివారం బీజేవైఎం ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ఆందోళన నిర్వహి
అయ్యప్ప మాల


మేడ్చల్ మల్కాజిగిరి, 6 డిసెంబర్ (హి.స.)

జీహెచ్ఎంసీ పోచారం సర్కిల్

పరిధిలోని నల్లమల్లా రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలకు అయ్యప్ప మాల వేసుకుని వచ్చిన విద్యార్థి పట్ల యాజమాన్యం అవమానకరంగా వ్యవహరించారని శనివారం బీజేవైఎం ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో కళాశాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కళాశాల యాజమాన్యం, లెక్చరర్ విద్యార్థి వేసుకున్న అయ్యప్ప మాల, దుస్తులను తీయించి కళాశాల యూనిఫామ్ వేయించి దుర్భాషలాడి, అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గడ్డాలు పెంచి, టోపీలు పెట్టుకొని తిరుగుతున్న ఇతర మతస్తులని ఏమి చేయలేని యాజమాన్యం...హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం సిగ్గుచేటు అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande