
ములుగు, 6 డిసెంబర్ (హి.స.) ములుగు జిల్లా తాడువాయి మండల రెవెన్యూ కార్యాలయంలో
కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే కంప్యూటర్లో గత వారం రోజులుగా సర్వర్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. సర్వర్ రాకపోవడంతో దరఖాస్తు చేసుకున్న ప్రజలు, విద్యార్థులకు సర్టిఫికెట్లు అందడం లేదు. విద్యార్థులు, ఉద్యోగ రీత్యా ప్రయత్నం చేసేవారు దరఖాస్తుల గడువు సమీపిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్టిఫికెట్లు పొందలేక, రోజు కార్యాలయం చుట్టూ తిరుగుతూ నిరాశగా వెనుదిరుగుతున్నారు. సర్వర్ సమస్యపై రెవెన్యూ సిబ్బంది చేతులెత్తేయడంతో ప్రజలు, విద్యార్థులు ఉన్నతాధికారుల వైపు చూస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, ఈ సర్వర్ సమస్యను పరిష్కరించి, సర్టిఫికెట్లు త్వరగా అందేలా చూడాలని స్థానిక ప్రజలు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు