
వరంగల్, 6 డిసెంబర్ (హి.స.)
వరంగల్ జిల్లా పోలీస్ కమిషనర్ సబ్స్క్రిత్ సింగ్ ను శనివారం ములుగు ఎస్పి సుధీర్ రామనాధ్ కేకన్, ఓఎస్డి శివం ఉపాధ్యాయ వరంగల్ కమిషనర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రెండు జిల్లాల మధ్య పోలీసింగ్ సమన్వయం, న్యాయ, శాంతి వ్యవస్థ బలోపేతం, నేరాలు నివారణ చర్యలు భద్రత వంటి అంశాలపై చర్చించారు.
వచ్చే నెలలో జరగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా పోలీసు శాఖ తీసుకోవాల్సిన అంశాలపై ముందస్తు ప్రణాళికను తయారు చేసుకుని జాతర విజయవంతం అయ్యేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఎస్ పి తెలిపారు. జిల్లా పోలీసు విభాగం చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలు, చురుకైన పోలీసింగ్ ను కమిషనర్ అధికారులను అభినందిస్తూ ప్రజా భద్రత, నేర నియంత్రణ సమర్థవంతమైన పోలీస్ సేవల కోసం ఇరు జిల్లాల మధ్య పరస్పర సహకారం ఉండాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు