
హైదరాబాద్, 6 డిసెంబర్ (హి.స.)
బీసీ యువకులెవరూ తొందరపడొద్దని.. త్వరలోనే రిజర్వేషన్లను సాధించుకుందామని టీపీసీసీ చీఫ్ అన్నారు. ఇవాళ ఆయన అంబర్పేట్లో బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మాహుతికి పాల్పడిన సాయి ఈశ్వరాచారి ఇంటికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అనే ప్రధాన భూమికతో పని చేస్తోందని అన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు అయ్యేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు