వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో శిశువు మృతి కలకలం..
హైదరాబాద్, 6 డిసెంబర్ (హి.స.) వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం శిశువు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కోసం ఆరోగ్య శాఖ అత్యవసరంగా ప్రత్యేక కమిటీని నియమించింది. మహేశ్వరం మెడికల్ కాలేజ్ సూపరిండెంట్ డా. నాగేందర
శిశువు మృతి


హైదరాబాద్, 6 డిసెంబర్ (హి.స.)

వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం శిశువు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కోసం ఆరోగ్య శాఖ అత్యవసరంగా ప్రత్యేక కమిటీని నియమించింది. మహేశ్వరం మెడికల్ కాలేజ్ సూపరిండెంట్ డా. నాగేందర్, వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ డా. కృష్ణ ఆధ్వర్యంలో ఐదుగురు వైద్యులతో కూడిన విచారణ కమిటీ శనివారం అధికారికంగా ఏర్పాటైంది. కమిటీ సభ్యులు తక్షణ విచారణ జరిపి ఈ రోజుకే రిపోర్టు సమర్పించాలి అని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande