అనుమాస్పద స్థితిలో కాలువలో పడి వివాహిత మృతి కుమారుడు గల్లంతు
అమరావతి, 6 డిసెంబర్ (హి.స.) మల్లమ్మ సెంటర్‌(పల్నాడు): అనుమానాస్పద స్థితిలో కాలువలో పడి వివాహిత మృతి చెందగా, ఆమె కుమారుడు గల్లంతైన ఘటన పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో చోటు చేసుకుంది. రొంపిచర్ల మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన శ్రీకాంత్ కుమారుడు శ
అనుమాస్పద స్థితిలో కాలువలో పడి వివాహిత మృతి కుమారుడు గల్లంతు


అమరావతి, 6 డిసెంబర్ (హి.స.)

మల్లమ్మ సెంటర్‌(పల్నాడు): అనుమానాస్పద స్థితిలో కాలువలో పడి వివాహిత మృతి చెందగా, ఆమె కుమారుడు గల్లంతైన ఘటన పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో చోటు చేసుకుంది. రొంపిచర్ల మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన శ్రీకాంత్ కుమారుడు శరత్‌(7 నెలలు) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో శుక్రవారం రాత్రి అతడు.. కుమారుడు, భార్య త్రివేణి(25)తో కలిసి నరసరావుపేటలోని ఆసుపత్రికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు.

ఈక్రమంలో మార్గమధ్యలో ఉన్న కాలువ వద్ద బొలెరో వాహనం అడ్డు రాగా దాన్ని తప్పించబోయి బైక్‌ అదుపుతప్పి పడిపోయింది. దీంతో శరత్, త్రివేణి కాలువలో పడ్డారు. శ్రీకాంత్‌ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు వచ్చి గాలింపు చేపట్టగా త్రివేణి మృతదేహం లభ్యమైంది. శరత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భార్యను, కుమారుడిని భర్త హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నట్లు వివాహిత కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయని, సమగ్రంగా విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. (Andhra

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande