దేశానికి అణుబాంబు కావాలని మాట్లాడారు : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు
విజయవాడ, 6 డిసెంబర్ (హి.స.) దేశానికి అణుబాంబు కావాలని మొదటిసారి పార్లమెంటులో మాట్లాడిన మహా నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయీ అని బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ 100వ జయంతి పురస్కరించుకొని.. డిసెం
దేశానికి అణుబాంబు కావాలని మాట్లాడారు : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు


విజయవాడ, 6 డిసెంబర్ (హి.స.)

దేశానికి అణుబాంబు కావాలని మొదటిసారి పార్లమెంటులో మాట్లాడిన మహా నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయీ అని బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ 100వ జయంతి పురస్కరించుకొని.. డిసెంబర్ 11 నుంచి 25 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న అటల్ సంకల్ప్ – మోడీ సిద్ధి యాత్రకు సంబంధిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా ఆయన హాజరయ్యారు. విజయవాడ తాజ్ వివంతాలో జరిగిన కార్యక్రమంలో మాధవ్ మాట్లాడుతూ అటల్ బీహారీ శత జయంతి కార్యక్రమాలని గుడ్ గవర్ణన్స్ డే గా జరుపుకుంటున్నాం అన్నారు. దేశహితం కోసమే ఆయన అనునిత్యం పరితపించేవారన్నారు. అందులో భాగంగానే దేశానికి అణుబాంబు కావాలని పార్లమెంటులో తొలిసారి గళమెత్తారన్నారు. దేశ సైనిక శక్తి పెరగాలని ఆకాంక్షించారని పేర్కొన్నారు. వాజ్ పేయీని పార్టీలకు అతీతంగా అందరూ గౌరవిస్తారన్నారు. మొదటి నుంచి మహాత్మా గాంధీ ఆశయాలను ఆయన ముందుకు తీసుకెళ్లేవారని తెలిపారు.

జనతా పార్టీని మోరార్జి దేశాయ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సంగతిని మాధవ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్టీ స్థాపన సమయంలో వాజ్ పేయూ కీలక భూమికను పోషించారన్నారు. పార్టీ మొదటి అధ్యక్షుడిగా ఆయన ఉన్నారని పేర్కొన్నారు. 1989లో అద్భుతమైన విజయాన్ని పార్టీ సాధించిందన్నారు. ఆ విజయంలో వాజ్ పేయీ ఘనమైన పాత్రను పోషించారని వెల్లడించారు. కవిగా, రచయితగా, సమర్థవంతుడైన పాలకుడిగా అందరి మన్ననలను పొందిన మహనీయుడు వాజ్ పేయీ అని కొనియాడారు. ప్రపంచ దేశాలతో సన్నిహిత సంబంధాలను నెలకొల్పడంలో ఆయన పోషించిన పాత్ర ఎనలేనిదన్నారు. కార్గిల్ యుద్ధంగా సైన్యానికి వెన్నంటి నిలిచి అసమాన విజయాన్ని సాధించడంలో ముందున్నారన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande