ఒక్క జిల్లాలోనే.. 15 లక్షల ఓట్ల తొలగింపు ?
చెన్నై/ఢిల్లీ ,06 డిసెంబర్ (హి.స.): చెన్నై జిల్లాలో సుమారు 15 లక్షల ఓట్లు తొలగించనున్నట్లు సమాచారం. చెన్నై జిల్లా పరిధిలోని 16 శాసనసభ నియోజకవర్గాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) పనులు గత నెల 4వ తేదీన ప్రారంభించారు. 3,718 మంది పోలింగ్‌ స్
SIR Enumeration Form


చెన్నై/ఢిల్లీ ,06 డిసెంబర్ (హి.స.): చెన్నై జిల్లాలో సుమారు 15 లక్షల ఓట్లు తొలగించనున్నట్లు సమాచారం. చెన్నై జిల్లా పరిధిలోని 16 శాసనసభ నియోజకవర్గాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) పనులు గత నెల 4వ తేదీన ప్రారంభించారు. 3,718 మంది పోలింగ్‌ స్టేషన్‌ అధికారులను నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జి, పర్యవేక్షణ అధికారులుగా నియమించారు. ఈ క్రమంలో, లెక్కింపు ఫారాలు పొందే అంశంపై గురువారం స్థానిక రిప్పన్‌ భవనంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో డీఎంకే, ఎండీఎంకే, బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఎం సహా 12 గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో అధికారులు మాట్లాడుతూ... చెన్నై(Chennai) జిల్లాలోని 40.04 లక్షల ఓటర్లలో 39.59 మందికి లెక్కింపు ఫారాలు అందజేశామన్నారు. వారిలో 22.79 లక్షల మంది నుంచి ఫారాలు పొందామని తెలిపారు. వారిలో 2.23 లక్షల మంది రెండు ఓట్లు కలిగి ఉన్నట్లు గుర్తించామన్నారు. అలాగే, 1.49 లక్షల మంది మృతిచెందిన జాబితాలో ఉన్నారని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande