
ఢిల్లీ ,06 డిసెంబర్ (హి.స.) ప్రపంచంలో ఏ దేశంతోనైనా సంబంధాలు ఏర్పరచుకునే హక్కు, స్వేచ్ఛ భారత్‌కు ఉన్నాయని విదేశాంగ మంత్రి జై శంకర్ (S Jaishankar) అన్నారు. భారత్ బంధాలను వీటో చేసే అధికారం ఏ దేశానికీ లేదని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఒడుదొడుకులు కొనసాగుతున్నా.. భారత్- రష్యా (India- Russia) సంబంధాలు స్థిరంగా ఉన్నాయన్నారు. శనివారం హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో జైశంకర్ మాట్లాడారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రష్యాతో బంధం కారణంగానే అమెరికా- భారత్‌ల వాణిజ్య ఒప్పందం మరింత క్లిష్టంగా మారిందా? అని విలేకరి ప్రశ్నించారు. దీనికి విదేశాంగ మంత్రి బదులిస్తూ.. ‘వీలైనంత ఎక్కువ దేశాలతో సహకారాన్ని కొనసాగించడం భారత్‌కు ఎంతో కీలకం. ప్రపంచంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు ఎవరితో సంబంధాలు కొనసాగించాలని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. గత 70-80 ఏళ్లుగా ప్రపంచం చాలా ఎత్తుపల్లాలు చూసింది. కానీ, భారత్-రష్యాల మధ్య బంధం స్థిరంగా కొనసాగుతుంది’ అని అన్నారు. దౌత్యం అంటే మరొకరిని సంతోషపెట్టడం కాదు అని వ్యాఖ్యానించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ