
ఢిల్లీ ,06 డిసెంబర్ (హి.స.) దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూను దూషించడమే కేంద్రంలోని అధికారపక్షం ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఆరోపించారు. నెహ్రూ ఘనతలను తుడిచేయడమే కాకుండా ఆయనకు సంబంధించిన సామాజిక, రాజకీయ పునాదులను నాశనం చేయాలని చూస్తోందన్నారు. అయితే ఆమె ఆరోపణలను భాజపా తిప్పికొట్టింది. అంత గౌరవమే ఉంటే.. నెహ్రూ ఇంటి పేరును ఆమె ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించింది.
‘‘ఇలాంటి విమర్శలు ఆపాల్సిన సమయం వచ్చింది. ఆమెకు అంత గౌరవం ఉంటే.. తన పేరులో నెహ్రూ ఇంటి పేరును చేర్చుకునేవారు. ఆయన సేవలను తక్కువ చేసి చూసే వ్యక్తులు వారే. ఇందులో భాజపాకు కానీ, ప్రస్తుత ప్రభుత్వానికి కానీ ఎలాంటి ప్రమేయం లేదు’’ అని భాజపా (BJP) అధికార ప్రతినిధి టామ్ వడక్కన్ మీడియాతో మాట్లాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ