నిజమైన దేశ నిర్మాణం అంటే అదే : మాజీ సీఎం వైయస్ జగన్
అమరావతి, 6 డిసెంబర్ (హి.స.) నేడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతిని (B.R.Ambedkar Death Anniversary) పురస్కరించుకొని ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైయస్ జగన్ (YS Jagan) కూడా తన ఎక్స్ వేదికగా బాబా సాహెబ్ అంబేద్కర్ ను స్
జగన్


అమరావతి, 6 డిసెంబర్ (హి.స.)

నేడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతిని (B.R.Ambedkar Death Anniversary) పురస్కరించుకొని ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైయస్ జగన్ (YS Jagan) కూడా తన ఎక్స్ వేదికగా బాబా సాహెబ్ అంబేద్కర్ ను స్మరించుకున్నారు. రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పిస్తున్నట్లు వైయస్ జగన్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాలనాపరమైన అంశంపై కీలక వ్యాఖ్యను చేశారు. అసలు దేశ నిర్మాణం అంటే ఏమిటనే విషయాన్ని నిర్వచించే ప్రయత్నం చేశారు. అలా చేయడమే నిజమైన దేశ నిర్మాణంగా అభివర్ణించారు. అవి ఆచరణ సాధ్యమైనప్పుడే రాజ్యాంగ స్ఫూర్తికి నిజమైన గౌరవం దక్కుతుందని అభిప్రాయపడ్డారు.

తన ఎక్స్ ఖాతాలో వైయస్ జగన్ పోస్ట్ చేస్తూ దేశంలోని ప్రజలందరికీ సమాన అవకాశాలు లభించాలని అన్నారు. ప్రజల హక్కులకు రక్షణ లభించాలని పేర్కొన్నారు. పరస్పర గౌరవంతో కుల, మత, వర్గ, ప్రాంత, భాషా బేధాలను మరచి ప్రజలు ఏకాత్మ భావంతో జీవించాలని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆకాంక్షించారన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande