

విజయనగరం, 6 డిసెంబర్ (హి.స.)
తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసులు మృతి చెందడం బాధాకరం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లా వాసుల మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శబరిమలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోనులో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసానిచ్చారు.
మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతి
తమిళనాడు రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసులు మృతి చెందడం అత్యంత బాధాకరమని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. వారి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని మంత్రి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు దైవం ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరగడం అత్యంత విచారకరమని అన్నారు.
తమిళనాడు రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసులు మరణించడం అత్యంత బాధాకరమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. బాధిత కుటుంబాలవారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాద విషయమై తమిళనాడు అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని తమిళనాడు అధికారులను కోరామని మంత్రి కొండపల్లి తెలిపారు. క్షతగాత్రులతో పాటు ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాల వారికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీనిచ్చారు. రాత్రి వేళ ప్రయాణించేటప్పుడు వాహనదారులు తగిన జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలని ప్రజలను కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV