సింహాచలం దొంగతనంపై వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్
సింహాచలం, 6 డిసెంబర్ (హి.స.) ఈ ఏడాది సెప్టెంబర్ 1న సింహాచలం దేవాలయంలో (Simhachalam Temple) జరిగిన దొంగతనంపై ఎక్స్ వేదిగా వైసీపీ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పలు కామెంట్స్ చేశారు. సింహాచలం దేవాలయంలో దేవస్థాన ఉద్యోగి రమణ, అవుట్ సోర్స
ycp-mla-comments-on-simhachalam-theft-501153


సింహాచలం, 6 డిసెంబర్ (హి.స.)

ఈ ఏడాది సెప్టెంబర్ 1న సింహాచలం దేవాలయంలో (Simhachalam Temple) జరిగిన దొంగతనంపై ఎక్స్ వేదిగా వైసీపీ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పలు కామెంట్స్ చేశారు. సింహాచలం దేవాలయంలో దేవస్థాన ఉద్యోగి రమణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేశ్ రూ.55వేలు దొంగతనం (Theft) చేస్తూ పట్టుబడ్డారని ఆరోపించారు. అయితే ప్రభుత్వం సింహాచలం దొంగతనం అంశాన్ని చూసి చూడనట్లుగా ఎందుకు వదిలేసిందని ప్రశ్నించారు. పరకామణి అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. సింహాచలం హుండీ దొంగతనం, తిరుమల పరకామణి దొంగతనం రెండూ కూడా తప్పేనని స్పష్టం చేశారు. కానీ కేవలం ఒకే ఉదంతాన్ని హైలైట్ చేయడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సింహాచంల దొంగతనం కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందా అని అనుమానాలను వ్యక్తం చేశారు. తిరుమల పరకామణి అయినా.. సింహాచలం హుండీ అయినా రెండూ పవిత్రమైనవేనని అనడంలో ఎటువంటి సందేహం లేదననారు. కానీ రెండు దొంగతనాల విషయంలో రెండు రకాల స్పందన పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

టీటీడీ పరకామణి అంశంలో సూత్రీకరించిన ఆరోపణలనే సింహాచలం హుండీ దొంగతనాని వర్తింపజేస్తే ఎలా ఉంటుందో చూడాలన్నారు. తిరుమల పరకామణి అంశాన్ని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కుట్రపూరితంగా ఆపాదించారన్నారు. కుట్రపూరిత ఆరోపణలు చేస్తే అవి నిజమైపోవని తెలిపారు. సింహాచల జీవితకాలం ధర్మకర్త అశోక్ గజపతి రాజు అని విషయాన్ని గుర్తు చేశారు. తమ పార్టీ నేతలపై చేస్తున్నటువంటి ఆరోపణలే ముఖ్యమంత్రితో పాటు ధర్మకర్తపై చేస్తే పరిస్థితి ఏమిటని వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. దొంగతనానికి పాల్పడిన సింహాచలం ఉద్యోగులకు ఎందుకు అరెస్టు చేయలేదో తనకు అర్థం కావడంలేదన్నారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande