
హైదరాబాద్, 7 డిసెంబర్ (హి.స.)
: ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం కొనసాగుతోంది. నేడు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రావాల్సిన 54 విమానాలు, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 61 విమానాలను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇండిగో సంక్షోభం దృష్ట్యా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. స్పైస్‌జెట్ విమాన సంస్థ దేశవ్యాప్తంగా వంద అదనపు విమానాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే, తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ముంబయి, దిల్లీ, పుణె, హావ్‌డా నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. వంద కంటే ఎక్కువ ట్రిప్పులతో 89 ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులో ఉంచారు. రైల్వేశాఖ 37 రైళ్లకు అదనపు కోచ్‌లు జోడించి నడుపుతోంది. శంషాబాద్ నుంచి పలు ప్రాంతాలకు జీఎంఆర్ సంస్థ, ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచాయి. చెన్నై, బెంగళూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖతో పాటు ఇతర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ