మహిళల ఫిర్యాదు.స్వీకరణకు త్వరలో ప్రత్యేక ఆన్ లైన్ పోర్టల్
బాపట్ల, 7 డిసెంబర్ (హి.స.) , మహిళల కోసం నాలుగు అంకెలతో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నెంబర్‌తోపాటు బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక ఆన్‌లైన్‌ పోర్టల్‌ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రాయపాటి శైలజ తెల
మహిళల ఫిర్యాదు.స్వీకరణకు త్వరలో ప్రత్యేక ఆన్ లైన్ పోర్టల్


బాపట్ల, 7 డిసెంబర్ (హి.స.)

, మహిళల కోసం నాలుగు అంకెలతో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నెంబర్‌తోపాటు బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక ఆన్‌లైన్‌ పోర్టల్‌ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రాయపాటి శైలజ తెలిపారు. శనివారం ఆమె బాపట్లలోని బాలికా సదన్‌, శిశుగృహ, సఖీ వన్‌స్టాప్‌ సెంటర్‌, గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ రాష్ట్రంలో పనిప్రదేశంలో మహిళా ఉద్యోగులు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు కమిషన్‌కు వారానికి ఒకటి చొప్పున ఫిర్యాదు వస్తోందని చెప్పారు. సఖీవన్‌స్టాప్‌ సెంటర్‌లో మహిళలు, బాలికలకు 24 గంటలూ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఓ మహిళ సమస్యపై అప్పటికప్పుడు ఎస్‌ఐని పిలిపించి చర్యలకు ఆదేశించారు. తల్లిదండ్రుల అనుమతి లేనిదే గురుకుల పాఠశాల విద్యార్థులను బయటకు పంపరాదన్నారు. విద్యార్థినులకు గుడ్‌టచ్‌, బ్యాడ్‌టచ్‌లపై అవగాహన కల్పించటం, అనుమానాస్పద వ్యక్తుల ప్రవర్తనపై అప్రమత్తం చేయడంపై కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande