
విజయవాడ, 8 డిసెంబర్ (హి.స.)
,మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీమోహన్‌కు(బిగ్ షాక్ తగిలింది. వంశీ ప్రధాన అనుచరుడు కొమ్మా కోట్లును విజయవాడ పటమట పోలీసులు ఇవాళ(సోమవారం) అదుపులోకి తీసుకున్నారు. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో ఏ2గా ఉన్నారు కొమ్మా కోట్లు.గత కొంతకాలంగా ఆయన అజ్ఞాతంలో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు కొమ్మా కోట్లును పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, కొమ్మా కోట్లును ఇవాళ అరెస్ట్ చేసినట్లు చూపనున్నారు పోలీసులు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కోర్టుకు పోలీసులు తీసుకువచ్చారు. న్యాయాధికారి ముందు కొమ్మా కోట్లును హాజరు పరిచారు పోలీసులు. ఈ సందర్భంగా కొమ్మా కోట్లు మీడియాతో మాట్లాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ