
ఆదిలాబాద్, 8 డిసెంబర్ (హి.స.)
మొదటి విడతలో 11న జరిగే
పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని ఐటీడీఏ ఇంచార్జ్ పీఓ యువరాజ్ మర్మట్ తో కలిసి కలెక్టర్ సందర్శించారు. అనంతరం ఎన్నికల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ పూర్తి అయిన అనంతరం బాక్స్ లను బద్రపరుచు విషయాలతో పాటుగా పోలింగ్ సిబ్బందికి అందించే మెటీరియల్ పై అధికారులతో చర్చించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు