అవినీతి రహిత సమాజమే మనందరి లక్ష్యం : సీపీ సన్ ప్రీత్ సింగ్
వరంగల్, 8 డిసెంబర్ (హి.స.) అవినీతి రహిత సమాజం ఏర్పాటు చేయడం మన అందరి లక్ష్యమని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. అవినీతి వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకొని అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని సోమవారం వరంగల్ పోలీస్ కమిషన
వరంగల్ సిపి


వరంగల్, 8 డిసెంబర్ (హి.స.) అవినీతి రహిత సమాజం ఏర్పాటు చేయడం మన అందరి లక్ష్యమని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. అవినీతి వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకొని అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ జండా ఊపి ప్రారంభించారు. హనుమకొండ జూనియర్ కళాశాల నుంచి అశోక సెంటర్ వరకు నిర్వహించిన ఈ అవగాహన ర్యాలీలో విద్యార్థులతో పాటు, స్వచ్ఛంద సంస్థలకు సభ్యులు, ఏసీబీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీపీ సన్రత్సింగ్ మాట్లాడుతూ అవినీతిని నిర్మూలించడం ద్వారా దేశాభివృద్ధి జరుగుతుందని, భవిష్యత్తులో అవినీతి నిర్మూలనలో విద్యార్థి, యువత పాత్ర చాలా కీలకమన్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాలని సీపీ సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande