రూ. కోటి 11 లక్షల గంజాయి పట్టివేత.. నలుగురు వ్యక్తులు అరెస్ట్..
భద్రాచలం, 8 డిసెంబర్ (హి.స.) భద్రాచలం మీదుగా ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలుస్తున్న రూ. 1,11,48,300 విలువైన గంజాయిని భద్రాచలం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గంజాయి పట్టుబడిన వివరాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్ పి జితేష్ వి పాటిల్ సోమవారం వ
గంజాయి పట్టివేత


భద్రాచలం, 8 డిసెంబర్ (హి.స.)

భద్రాచలం మీదుగా ఇతర ప్రాంతాలకు

అక్రమంగా తరలుస్తున్న రూ. 1,11,48,300 విలువైన గంజాయిని భద్రాచలం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గంజాయి పట్టుబడిన వివరాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్ పి జితేష్ వి పాటిల్ సోమవారం వెల్లడించారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఆంధ్ర కూనవరం నుండి భద్రాచలం మీదుగా అశోక్ లేలాండ్ వాహనంలో గంజాయి తరలిస్తూ, పోలీసులను చూసి వాహనాన్ని వెనక్కు మల్లించడంతో పోలీసులు అనుమానించి వాహనాన్ని వెంబడించి పట్టుకుని తనిఖీ చేశారు.

ఆ వాహనంలో 222.966 కేజీల గంజాయి గల 110 ప్యాకెట్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ 1,11,48,300 ఉంటుందని ఎస్పీ తెలిపారు. వాహనంతో పాటు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని, నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande