
విజయవాడ, , 8 డిసెంబర్ (హి.స.)
రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఫ్లవర్ ఎక్స్‌పో డిసెంబరు 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఫ్లవర్ ఎక్స్‌పోకు పలు ప్రపంచ దేశాల నుంచి కూడా మొక్కలను తీసుకువచ్చి ప్రదర్శించారు. విజయవాడ వాసులు ఈ ఎక్స్‌పోను సందర్శించి తమకు కావాల్సిన మొక్కలను కొనుగోలు చేశారు. పలువురు అందమైన మొక్కలతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. నాలుగు రోజుల పాటు నగర వాసులను అలరించింది ఈ ఫ్లవర్ ఫ్లవర్ ఎక్స్‌పో. ఈ ప్రదర్శనలో దేశా, విదేశాలకు చెందిన మొక్కలు ఎంతో స్పెషల్‌గా నిలిచాయి. బోన్సాయ్ మొక్కలు ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ