
సత్య సాయి జిల్లా 8 డిసెంబర్ (హి.స.)
,:సూరత్ నుంచి బెంగుళూరు తరలిస్తున్న హవాలా డబ్బునే ఎత్తుకెళ్లిపోయారు దుండగులు. జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సూరత్ నుంచి ఇద్దరు వ్యక్తులు నాలుగు కోట్ల 20 లక్షల రూపాయలను బెంగళూరుకు తరలిస్తున్నారు. అయితే హవాలా డబ్బు తరలిస్తున్న ఇన్నోవా కారును దుండగులు అడ్డగించారు. డబ్బును తరలిస్తున్న కారును.. మరో నాలుగు కార్లతో వెంబడించిన దుండగులు.. పెనుకొండ దగ్గర కారును అడ్డగించారు. ఆపై కారుతో సహా సూరత్ నుంచి వచ్చిన వ్యక్తులను కిడ్నాప్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ