
నెల్లూరు, 8 డిసెంబర్ (హి.స.)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాలనివారణపై ఎంతగానో అవగాహన కల్పిస్తున్నాయి. కొంతమంది వాహనదారులు అత్యంత వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆయా ఘటనల్లో వాహనదారులు మరణిస్తుండటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నెల్లూరు జిల్లాలో ఇవాళ (సోమవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు పోలీసులు వెల్లడించారు.
ఇందుకూరుపేట మండలం గంగపట్నం వేపచెట్టు సెంటర్‌లో సైకిల్‌పై స్కూల్‌కు వెళ్తున్నఇద్దరు విద్యార్థులను ఢీకొట్టింది ఏపీఎస్ ఆర్టీసీ బస్సు. ఈ ప్రమాదంలో పులికిరణ్ (12) అనే విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా.. సోదరుడు కార్తీక్‌కి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు గంగపట్నం వెంకటరెడ్డి కాలనీకి చెందిన బాలుడుగా గుర్తించారు పోలీసులు. కొంతకాలం క్రితమే బాలుడు తండ్రి విద్యుదాఘాతంతో మృతిచెందారు. కొడుకు కూడా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో మృతదేహం వద్ద తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈ ప్రమాదంపై నెల్లూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ