వేంపల్లి పట్టణంలో పలువురు నేతలు.వైసిపి.నుచి.టీడీపీలోకి చేశారు
కడప, 8 డిసెంబర్ (హి.స.) :ఏపీలో అధికారం కోల్పోయినప్పటి నుంచి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పలువురు.షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. కేవలం 11 సీట్లతో ఘోర ఓటమిని చవిచూసిన జగన్‌కు.. పార్టీ నేతలు కూడా కంటి మీద కునుకు లేకుండా
వేంపల్లి పట్టణంలో పలువురు నేతలు.వైసిపి.నుచి.టీడీపీలోకి చేశారు


కడప, 8 డిసెంబర్ (హి.స.)

:ఏపీలో అధికారం కోల్పోయినప్పటి నుంచి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పలువురు.షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. కేవలం 11 సీట్లతో ఘోర ఓటమిని చవిచూసిన జగన్‌కు.. పార్టీ నేతలు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ముఖ్య నేతల నుంచి కిందస్థాయి శ్రేణులు అందరూ కూడా పార్టీని వీడుతున్నారు. ఓటమి మొదలు జగన్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా సొంత ఇలాకాలో జగన్‌కు ఆ పార్టీ నేతలు భారీ షాక్ ఇచ్చారు. పులివెందులలో వైసీపీ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.

వేంపల్లి పట్టణంలో పలువురు నేతలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఈరోజు (సోమవారం) పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి బీటెక్ రవి సమక్షంలో కొంతమంది వైసీపీ శ్రేణులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందిరికీ బీటెక్‌ రవి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం కారణంగా ఆగిపోయిన పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు నాయుడు పాలన చూసి పులివెందుల వైసీపీ నేతలు పార్టీలో చేరుతున్నారని బీటెక్ రవి వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande