జహీరాబాద్లో హైడ్రా తరహా కూల్చివేతలు
జహీరాబాద్, 8 డిసెంబర్ (హి.స.) జహీరాబాద్ లో హైడ్రా తరహా చర్యలు చేపట్టారు. అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు. జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ, సాయి నగర్ కాలనీల మధ్య అక్రమంగా నిర్మిస్తున్న సెల్ టవర్ ను మున్సిపల్ అధికారులు
హైడ్రా


జహీరాబాద్, 8 డిసెంబర్ (హి.స.)

జహీరాబాద్ లో హైడ్రా తరహా

చర్యలు చేపట్టారు. అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు. జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ, సాయి నగర్ కాలనీల మధ్య అక్రమంగా నిర్మిస్తున్న సెల్ టవర్ ను మున్సిపల్ అధికారులు జెసిబి తో సోమవారం కూల్చివేశారు. గత కొన్ని నెలలుగా స్థానికులు సెల్ టవర్ ఏర్పాటు చేస్తున్న స్థలం ప్రభుత్వానిదని, ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని పలుమార్లు విన్నవించుకున్నారు. దీంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారి శ్యాంత్ కుమార్ తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని సందర్శించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి, అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు నిర్ధారించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande