
అమరావతి, 9 డిసెంబర్ (హి.స.)
రాజధాని అమరావతిలో (Amaravati) చేపట్టబోయే అభివృద్ధి ప్రాజెక్టులకు అనుగుణంగా తదుపరి భూసేకరణ ఉంటుందని రాష్ట్ర పురపాలక పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Minister Ponguru Narayana) అన్నారు. రాజధాని ప్రాంతంలో ఏడీసీ చైర్ పర్సన్ లక్ష్మీపార్థసారథి, ఇంజనీర్లతో కలిసి ఆయన పర్యటించారు. పర్యటనలో భాగంగా అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన నంతరం గుంటూరు చానల్ పై నిర్మిస్తు్న్న స్టీల్ బ్రిడ్డి వద్దకు వెళ్లారు. అక్కడ బ్రిడ్జి నిర్మాణ పనులను చూశారు. అదే విధంగా అమరావతి రాజధాని రైతుల ప్లాట్లలో జరుగుతున్న మౌలిక వసతులపై కల్పన పనులను పరిశీలించి.. పనుల స్థితిగతులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడొద్దని అధికారులకు సూచించారు.
అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ త్వరలోనే మంగళగిరి రహదారికి సీడ్ యాక్సెస్ రహదారిని అనుసంధానం చేయనున్నామని తెలిపారు. రాజధాని పరిధిలో పార్కులు, నీటి రిజర్వాయర్లు, రహదారులు వంటి ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టబోతున్నామని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV