
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 09 డిసెంబర్ (హి.స.)దిల్లీలో పేలుడు (Delhi Blast Case) కేసును దర్యాప్తు చేసే కొద్దీ అనేక విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించిన ఓ విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మంగళవారం జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా అటవీ ప్రాంతంలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఉగ్ర కుట్ర కేసులో అరెస్టైన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ నిందితులు డాక్టర్ అదీల్ అహ్మద్, జాసిర్ బిలాల్‌లను పోలీసుల సహాయంతో ఎన్‌ఐఏ అధికారులు అనంత్‌నాగ్‌కు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
అనంత్‌నాగ్ జిల్లాలోని మట్టన్ అటవీ ప్రాంతంలో ఉగ్ర ముఠాలు ఆశ్రయం పొందే పలు రహస్య స్థావరాల సమాచారాన్ని నిందితులు అధికారులకు తెలిపినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ