ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన భద్రాద్రి కలెక్టర్
భద్రాచలం, 9 డిసెంబర్ (హి.స.) భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 20 వ తేదీ నుండి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీనిలో భాగంగా 29 వ తేది స్వామివారికి పవిత్ర గోదావరి నదిలో హంస వాహనం పై తెప్పోత్సవం
భద్రాద్రి కలెక్టర్


భద్రాచలం, 9 డిసెంబర్ (హి.స.)

భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 20 వ తేదీ నుండి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీనిలో భాగంగా 29 వ తేది స్వామివారికి పవిత్ర గోదావరి నదిలో హంస వాహనం పై తెప్పోత్సవం నిర్వహించనున్నారు. అలాగే 30 వ తేది ఉదయం ఉత్తరద్వారంలో స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

ముక్కోటి ముహూర్తం సమీపిస్తుండటంతో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం పరిశీలించారు. తెప్పోత్సవం జరిగే గోదావరి ప్రాంతంతో పాటు ఉత్తర ద్వారం వద్ద ఏర్పాటు చేస్తున్న గ్యాలరీ నిర్మాణాలను పరిశీలించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్వరిత గతిన పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande