
హైదరాబాద్, 9 డిసెంబర్ (హి.స.)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కాన్వాయ్కు సంబంధించిన జామర్ కారు (Jammer car)కు పెను ప్రమాదం తప్పింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 17 వద్ద సీఎం కాన్వాయ్ను అనుసరిస్తున్న జామర్ కారు రన్నింగ్లో ఉండగానే టైర్ అకస్మాత్తుగా పగిలిపోయింది. టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో కారు అదుపు తప్పే పరిస్థితి ఏర్పడింది. ఈ అనూహ్య ఘటనతో కాన్వాయ్ స్వల్ప అలజడి నెలకొంది. ఒకవేళ వాహనం నియంత్రణ కోల్పోయి ఉంటే, కాన్వాయ్లె ఘోర ప్రమాదం సంభవించి ఉండేదని తెలుస్తోంది. అయితే, కారు టైరు పగిలి పోయినప్పటికీ, డ్రైవర్ తన చాకచక్యాన్ని ప్రదర్శించి పెను ప్రమాదాన్ని తప్పించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన డ్రైవర్, వాహనాన్ని సమర్థవంతంగా నియంత్రించి, సురక్షితంగా కంట్రోల్ చేయగలిగారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..