
హైదరాబాద్, 9 డిసెంబర్ (హి.స.)
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండవ రోజు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోని కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను ఆయన వర్చువల్గా ప్రారంభించారు. ఆయన వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వాకిటి శ్రీహరి, సీఎస్ రామకృష్ణారావు ఉన్నారు. ప్రతి విగ్రహానికి రూ.17.50 లక్షల వ్యయం చొప్పున రూ.5.80 కోట్ల నిధులను తెలంగాణ సర్కార్ మంజూరు చేసింది.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై డిసెంబర్ 9న సోనియాగాంధీ నాయకత్వంలోని నాటి యూపీఏ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసిన రోజు ఇదేనని అన్నారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ.. అప్పటి ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..