
హైదరాబాద్, 9 డిసెంబర్ (హి.స.) తెలంగాణను ఆవిష్కరణల కేంద్రంగా మార్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్యూర్, క్యూర్, రేర్గా రాష్ట్రాన్ని విభజించి ప్రణాళికలు చేపట్టామని చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీలో రెండవరోజు గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యం కోసం మూలధనం, ఉత్పాదకత పెంచడం అంశంపై జరిగిన చర్చలో భట్టి మాట్లాడారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ముందున్నామని ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్పై దృష్టి పెట్టామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..