
హైదరాబాద్, 9 డిసెంబర్ (హి.స.)
మీ పాలన వద్దంటూ గత ఎన్నికల్లో
బీఆర్ఎస్ నన్ను ప్రజలు చీకొట్టినా ఆ పార్టీ నేతలకు మాత్రం బుద్ధి రావడం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి తాగుబోతుల తెలంగాణగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ హరీశ్రావు చేసిన వ్యాఖ్యలకు ఇవాళ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. గత పదేళ్లు కల్వకుంట్ల కుటుంబం ప్రైవేట్ లిమిటెడ్గా తయారై తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తూ దోచుకుందని అన్నారు. ఎన్నికల్లో చిత్తుగా ఓడినా.. ప్రజా ప్రభుత్వాన్ని హరీశ్రావు ఆడిపోసుకుంటున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజా భవన్లోకి ఏ ఒక్క ప్రజాప్రతినిధిని రానీయని సంస్కృతిని తెచ్చింది బీఆర్ఎస్ పాలకులే కదా అని ప్రశ్నించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..