
నాగర్ కర్నూల్, 9 డిసెంబర్ (హి.స.)
అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల
నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మాడ్గుల మండలం నాగిళ్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువజన నాయకులు కొందరు మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన సాగుతుందని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని ప్రభుత్వానికి బాసటగా నిలవాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు